Raj Tarun : రాజ్ తరుణ్ కు మాల్వి తో ఇల్లీగల్ రేలషన్ ఉందంటున్న లావణ్య

మాల్వి, రాజ్ తరుణ్‌పై లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది...

Raj Tarun : హీరో రాజ్ తరుణ్, మల్హోత్రా మెసేజ్ చాటింగ్‌లో.. వారి డేటింగ్‌‌, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్‌ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రాకు ప్రపోజ్ చేశాడు. దానికి మాల్వి యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ పెట్టింది.. అనేకసార్లు రాజ్ తరుణ్‌(Raj Tarun)కు మాల్వీ హోటల్స్ కూడా బుక్ చేసింది. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చాట్స్‌ లీక్‌ కావడం సంచలనంగా మారింది.

Raj Tarun Case..

మాల్వి, రాజ్ తరుణ్‌పై లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్‌(Raj Tarun)కి పోలీసులు నోటీసులు కూడా పంపారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. రాజ్ తరుణ్ రాలేదు. షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్‌తో పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు.

ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ సైతం లావణ్య పై కేసు పెట్టింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్య. ఆ మధ్య ఆత్మహత్య ఆలోచన కూడా చేసింది లావణ్య. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నానో అప్పుడు వివరించింది లావణ్య. తనకు రాజ్ తరుణ్ కావాలని.. అతని కోసమే ఈ ఫైట్ చేస్తున్నానని వెల్లడించింది. తాను రాజ్‌ తరుణ్ 11 ఏళ్లు కలిసి ఉన్నామని వివరించింది. రాజ్ తరుణ్ కోసం తాను నిరాహార దీక్ష చేస్తానని… దీనిపై సినిమా పెద్దలను కలుస్తానని స్పష్టం చేసింది. తనపై పోలీసులు పెట్టిన డ్రగ్స్ కేసు ఫాల్స్ కేసుగా అభివర్ణించింది.

Also Read : Niharika Vs Bunny Vas : నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న ఇరు నిర్మాతలు

BreakingMalvi MalhotraRaj TarunUpdatesViral
Comments (0)
Add Comment