NTR : హైదరాబాద్ – నందమూరి తారక రామారావు వర్ధంతి ఇవాళ. భారత దేశ చరిత్రలో తనకంటూ ఓ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ఎన్నో మైలురాళ్లు తన జీవితంలో ఉన్నాయి. నటుడిగా, నట సార్వ భౌముడిగా, సాహితీ పిపాసకుడిగా, కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
Legendary Actor NTR..
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకేచోటు చేర్చిన ఘనత ఎన్టీఆర్(NTR) కే దక్కుతుంది. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకు వచ్చింది కూడా ఆయనే. పని పట్ల, విలువల పట్ల, జీవితం పట్ల అత్యంత నిక్కచ్చిగా ఉంటూ వచ్చారు. చివరి శ్వాస వరకు ఆయన ప్రజల కోసం పరితపించారు.
తన కెరీర్ లో అత్యుత్తమమైనది ఏమిటంటే తెలుగుదేశం పార్టీని స్థాపించడం . 1983లో వచ్చిన ఆ పార్టీ సంచలనం సృష్టించింది. ఉమ్మడి ఏపీలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సీఎం అయ్యాక ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2 కే బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎందరో నాయకులను తయారు చేశారు. తన హయాంలోనే తెలుగు వారికీ గుర్తింపు లభించింది.
Also Read : Saif Attack – Health Updates : నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం