Lamp : ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చేసింది. దీంతో వారి అభిప్రాయాలు, ఆలోచనలకు తగ్గట్టు సినిమాలు తీసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్. ప్రధానంగా హారర్, కామెడీ, రొమాన్స్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా ఉండడం లేదు. ప్రత్యేకించి కామెడీ ఎక్కువగా డామినేట్ చేస్తోంది. ప్రత్యేకించి వయొలెన్స్ కు ఓటు వేయడం లేదు. దీంతో కొత్తగా దర్శకత్వం వహిస్తున్న వారంతా ఏదో ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని దానికి కథలు అల్లడం మొదలు పెడుతున్నారు.
Lamp Movie Updates
ఈ మధ్యనే ఎవరూ ఊహించని రీతిలో అటు తమిళంలో ఇటు తెలుగులో రిలీజ్ అయ్యింది డ్రాగన్. అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇందులో సహజ సిద్దమైన నటనతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. లియో అందించిన సంగీతం మ్యాజిక్ చేసింది. ఇక కయాదు లోహర్ అయితే నేషనల్ క్రష్ గా మారింది. ఈ అమ్మడి నటనకు జనం ఫిదా అయ్యారు.
తాజాగా ఇదే కోవలో చిన్న చిత్రంగా విడుదలయ్యేందుకు సిద్దం కాబోతోంది ల్యాంప్(Lamp). ఇది పూర్తిగా హారర్ , కామెడీ, రొమాన్స్ ఉండేలా తీశారు. టీజర్ మరింత ఆసక్తిని రేపుతోంది. నాన్ స్టాప్ నవ్వులు పూయించేందుకు సిద్దమవుతోంది. మేకింగ్ పరంగానూ కొత్తగా ఉంది ఈ చిత్రం. మొత్తంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఉందని చెప్పక తప్పదు. ఇందులో ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి ఓ పాట పాడింది. మధు ప్రియ, కోటి కిరణ్, రాకేష్ మాస్టర్, అవంతిక కీలక పాత్రల్లో నటించారు. ఈనెల 14న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ల్యాంప్ .
Also Read : Mufasa The Lion King Sensational : జియో హాట్ స్టార్ లో ముఫాసా ద లయన్ కింగ్