Lal Salaam Movie : డిసెంబ‌ర్ లో రానున్న లాల్ స‌లామ్

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ మూవీ

Lal Salaam Movie : త‌మిళ‌నాడు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ఏకైక స్టార్ సూప‌ర్ స్టార్ , త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న లాల్ స‌లామ్ పై ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా భాటియాతో క‌లిసి న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపుతోంది. ఆగ‌స్టు 10న విడుద‌లైన జైల‌ర్ చిత్రం కేవ‌లం 18 రోజుల‌లో రూ.600 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా రికార్డుల మోత మోగిస్తోంది.

Lal Salaam Movie Fans are Waiting

బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. జై భీమ్ సినిమాను ద‌ర్శక‌త్వం వ‌హించిన క్రియేటివ్ , క‌మిటెడ్ డైరెక్ట‌ర్ టీజే జ్ఞాన‌వేల్ స‌పోర్ట్ తో ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ లాల్ స‌లామ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్(Rajinikanth) న‌టించ‌డం విశేషం.

లాల్ స‌లామ్ చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేశారు. ఇందులో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. త‌లైవా కేవ‌లం అతిథి పాత్ర‌లో ఉండ‌ట‌మే కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం క‌నిపిస్తాడని టాక్. విష్ణు విశాల్ , విక్రాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. ఈ చిత్రం చివ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతోంది.

లాల్ స‌లామ్ లో మొయిదీన్ భాయ్ గా ర‌జ‌నీకాంత్ ప‌ల‌క‌రించ‌నున్నారు. విష్ణు విశాల్ , తిరునావుక‌రను, విక్రాంత్ , క‌పిల్ దేవ్ , నిరోషా, సెంథిల్ , తంబి రామ‌య్య‌, టైగ‌ర్ తంగ‌దురై, జై ప‌రాశ‌ర్ , స‌లీం, జీవిత న‌టిస్తున్నారు.

Also Read : Salaar Movie : యుఎస్ లో స‌లార్ అడ్వాన్స్ బుకింగ్

lal salaam movie rajinikanth vishal vikranth release december
Comments (0)
Add Comment