Lakshmi Manchu: అమెరికా విసా కోసం సాయం చేయాలంటూ నెటిజన్లకు మంచు లక్ష్మి విజ్ఞప్తి !

అమెరికా విసా కోసం సాయం చేయాలంటూ నెటిజన్లకు మంచు లక్ష్మి విజ్ఞప్తి !

Lakshmi Manchu: వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా తాను పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరారు. భారత్‌ లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు.

Lakshmi ManLakshmi Manchu

‘‘అమెరికా సిటిజన్‌ అయిన నా కుమార్తె స్కూల్‌ హాలీడేస్‌ త్వరలోనే ముగియనున్నాయి. ఈ నెల 12న మేం అక్కడకు వెళ్లాల్సి ఉంది. అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వారిని సంప్రదించేందుకు నాకు మార్గం లేకుండా పోయింది. వీసా జారీ అయి నెలకుపైనే అయినా దాన్ని చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఎవరైనా హెల్ప్‌ చేయగలరా ?’’ అని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇవ్వగా… ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని నేరుగా ఎంబసీకి వెళ్లండంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.

Also Read : Dil Raju: సీఎం రేవంత్‌ రెడ్డి సూచనపై స్పందించిన నిర్మాత దిల్ రాజు !

Lakshmi ManchuManchu Mohan Babu
Comments (0)
Add Comment