Hero Vishwak-Laila Movie :పృథ్వీ కామెంట్స్ తో మాకు సంబంధం లేదు

లైలా మూవీ మేక‌ర్స్ షాకింగ్ కామెంట్స్

Laila : హైద‌రాబాద్ – లైలా మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ లో న‌టుడు పృథ్వీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. నిర్మాత సాహు గార‌పాటి, న‌టుడు విశ్వ‌క్ సేన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పృథ్వీ చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్నారు. బాయ్ కాట్ లైలా(Laila) అంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ‌డం చూసి తాము షాక్ కు గుర‌య్యామ‌న్నారు.

Laila Movie Team Responds

అది మాకు తెలిసి జ‌ర‌గ‌లేద‌న్నారు. సినిమాను అంద‌రూ సినిమా లాగే చూడాల‌ని, వేరే ఉద్దేశాల‌ను ఆపాదించ వ‌ద్ద‌ని కోరారు న‌టుడు విశ్వ‌క్ సేన్. అతిథులుగా వ‌చ్చిన వాళ్లు ఏమి మాట్లాడ‌తారో త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. దానితో త‌మ‌కు సంబంధం ఉండ‌ద‌న్నారు.

మా లైలా ఈవెంట్ లో జ‌రిగిన దానికి సారీ చెబుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. సినిమాలో ఎవ‌రో ఒక‌రు త‌ప్పు చేస్తే అంద‌రూ త‌ప్పు చేసిన‌ట్లు ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించారు. పృథ్వీ మాట్లాడిన విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌న్నారు.

ఆయ‌న మాట్లాడిన దానికి లైలాకు సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ వ‌చ్చాయ‌ని, అస‌లు సినిమా బ‌త‌కాలా వ‌ద్దా అని వాపోయారు. తాము చిరంజీవిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లామ‌ని, అంత‌లోపే పృథ్వీ కామెంట్స్ చేశాడ‌న్నారు. త‌మ కంట్రోల్ లో జ‌ర‌గ‌లేదన్నారు. చాలా క‌ష్ట‌ప‌డి సినిమా తీశామ‌న్నారు. త‌మ ప్రమేయం లేని దానికి త‌మ‌ను బ‌లి చేయొద్దంటూ వేడుకున్నారు.

Also Read : Prudhvi Shocking Comments :పృథ్వీ కామెంట్స్ లైలాకు షాక్

Comments (0)
Add Comment