Laila : రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా చిత్రం రిలీజ్ కాకుండా భారీ ఆదరణ చూరగొంటోంది. ఇందులో సోనూ మాడల్ గా , ఇంకో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో బాగంగా సినిమాకు సంబంధించి విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.
Vishwak Sen Laila Movie Updates
వచ్చే ఫిబ్రవరి 14న లైలాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పోస్టర్స్, సింగిల్స్ , టీజర్ అన్నీ జనాదరణ చూరగొన్నాయి. ప్రధానంగా లేడీ పాత్రలో విశ్వక్ సేన్(Vishwak Sen) అచ్చంగా అమ్మాయి లాగానే ఉండడం మరింత ఆసక్తిని పెంచింది లైలా చిత్రంపై.
తాజాగా సినిమాలోని సింగిల్ పాట ఇచ్చుకుందాం బేబీన ఇ విడుదల చేశారు. ఇది మరింత మెలోడీ సాంగ్ గా గుర్తింపు పొందింది. చిత్రీకరణ కూడా హైలెట్ గా నిలిచింది సినిమాకు. లైలా చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వేసవిలో మరింత చల్లదనం కల్పించేలా సినిమాను దర్శకుడు తీర్చిదిద్దాడని పేర్కొన్నారు నిర్మాత. ఇక విశ్వక్ సేన్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు బాలయ్య సపోర్ట్ ఉండడం విశేషం.
Also Read : IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం