Laggam : లగ్గం.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన సినిమా ఇది. అచ్చ తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాస.. సాంప్రదాయాలు, పెళ్లితంతును ఆకట్టుకునేలా.. అనేక అడ్డంకులు.. సవాళ్లను ఒక్కటిగా ఎదుర్కొనే కుటుంబం చుట్టూ తిరిగే కథే ఇది. ఇందులో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి వంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. లగ్గం(Laggam) సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
Laggam Movie OTT Updates
ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అతి తక్కవ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించాడు. తన చెల్లి కొడుకునే తన కూతురికి భర్తగా తీసుకురావాలని అనుకునే తండ్రికి అనుకోని విధంగా పెళ్లి ఆగిపోవడంతో షాక్ తగులుతుంది. అసలు ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది..? ఆ తర్వాత ఏం జరిగింది ? … చివరకు వీళ్లు ఒక్కటయ్యారా ? అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రానికి రమేశ్ చెప్పాలా దర్శకత్వం వహించగా.. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, చమ్మక్ చంద్ర లాంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.
Also Read:Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా నుంచి మహాదేవ శాస్త్రి లుక్