Laapataa Ladies : అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ‘ఆస్కార్ క్యాంపెయిన్’ షురూ చేశారు. దీంతో అమెరికాలో ‘లాపతా లేడీస్(Laapataa Ladies)’ జోరు కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే ఒక ట్విస్ట్ ఏర్పడింది. ఇది ఈ సినిమా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. కానీ.. మేకర్స్ తప్పదంటున్నారు.
Laapataa Ladies Upddates
ఆస్కార్బరిలో ఉన్న సినిమాలకి ‘ఆస్కార్ క్యాంపెయిన్’ అనేది చాలా ప్రధానం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కి కూడా రాజమౌళి టీమ్ కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ‘ఆస్కార్ క్యాంపెయిన్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా న్యూయార్క్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, కిరణ్ రావులతో పాటు చెఫ్ వికాస్ ఖన్నా పాల్గొని సందడి చేశారు. అయితే అమెరికన్ జ్యూరీకి అర్థమయ్యే విధంగా ఈ సినిమా టైటిల్ ని లాస్ట్ లేడీస్ గా మార్చారు. దీంతో అభిమానులు కాస్త వ్యక్తం చేసిన మేకర్స్ మాత్రం తప్పదంటున్నారు. అఫీషియల్ గా లాస్ట్ లేడీస్ పేరుతో మరో పోస్టర్ ని విడుదల చేశారు. ఏదిఏమైనప్పటికీ ఈ సినిమా ఆస్కార్ వేదికగా జయకేతనం అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఈఏడాది సెప్టెంబర్ లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామ్ చెందిన దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. ఆయన ఈ చిత్రాన్ని ఎంపిక చేయడానికి గల కారణాన్ని వివరించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్(Laapataa Ladies) భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్క రోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు.. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరూ చర్చించుకొని ‘లాపతా లేడీస్’ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా అన్నారు.
Also Read : Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు