Mohan Lal : ఎప్పు డెప్పుడా అని ఎదురు చూస్తున్న మోహన్ లాల్(Mohan Lal) నటిస్తున్న ఎంపురాన్ మూవీ టీజర్ రిలీజైంది. అత్యంత శక్తివంతమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునేలా తీశాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. టీజర్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో మూవీ తీస్తానని ప్రకటించాడు.
Mohan Lal – Empuraan Movie Teaser Updates
ఇక మూవీ విషయానికి వస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫియర్సమ్ స్టీఫెన్ గా తిరిగి వచ్చాడు. ది వరల్డ్ విల్ నెవర్ బి సేమ్ ఎగైన్ అన్న డైలాగ్ ఇప్పటికే పాపులర్ అయ్యింది. ఎంపురాన్ లో మంజు వారియర్ , ఇంద్రజిత్ సుకుమారన్ , టోవినో థామస్ కీలక పాత్రలలో నటించారు. మంజు వారియర్ ఈ మధ్యనే తలైవాతో నటించింది. దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క పాటతో వైరల్ గా మారింది.
మోహన్ లాల్ పలు భాషల్లో ఇప్పటికే సినిమాలలో నటించాడు..మెప్పించాడు. జనతా గ్యారేజ్ లో తారక్ తో నటించిన తీరు ప్రతి ఒక్కరిని తనను అభిమానించేలా చేసింది. వర్మ మూవీలో కూడా హిందీలో నటించాడు.
ఇక ఎంపురాన్ మూవీ 143 సెకన్ల టీజర్ యుద్ధంతో దెబ్బతిన్న ఇరాకీ పట్టణం ఖరాకోష్‌లో ప్రారంభమవుతుంది, ఇక్కడ ప్రేక్షకులు వెంటనే ఉద్రిక్త వాతావరణంలోకి లాగబడతారు. దృశ్యం మారుతున్న కొద్దీ, “డెత్ టు ది ఈవిల్” అనే పదబంధం నేపథ్యంలో కనిపిస్తుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన కిరాయి సైన్యానికి నాయకత్వం వహిస్తాడు..అతడే స్టీఫెన్. మురళీ గోపి కథ రాయగా దీపక్ దేవ్ సంగీతం అందించారు.
Also Read : Beauty Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఇండియన్ స్టోరీ షురూ