L2 Empuraan : పృథ్వీరాజ్ సుకుమార్ నటించి దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ ఎంపురాన్ దూసుకు పోతోంది. బాక్సులు బద్దలు కొడుతోంది. ఆశించిన దానికంటే అత్యధికంగా వసూళ్లు సాధించి సినీ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది. దమ్మున్న నటుడిగా పేరు పొందిన మోహన్ లాల్ ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు. గతంలో వచ్చిన లూసీఫర్ కూడా బిగ్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా దీనికి కొనసాగింపుగా వచ్చిందే ఎంపురాన్.
L2 Empuraan Movie Success
విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఏకంగా రూ. 100 కోట్ల కబ్ లోకి చాలా దగ్గరలో ఉంది. దీంతో మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గత నెల మార్చి 27న విడుదలైంది. ఇప్పటికే 99 కోట్లను దాటేసింది. ఎనిమిదో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది మోహన్ లాల్ చిత్రం. మలయాళంలో రెండో గురువారం 23.26 శాతం ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసింది.
ఇక ఎల్ 2 ఎంపురాన్(L2 Empuraan) చిత్రంలో మోహన్ లాల్ ఖురేషీ అబ్రామ్ పాత్రను పోషిస్తే పృథ్వీ రాజ్ సుకుమారన్ జాయెద్ మసూద్ గా కనిపించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ , సచిన్ ఖేడేకర్ , అభిమన్యు సింగ్ , మంజు వారియర్ , సూరజ్ వెంజరమూడు, జెరోమ్ ప్లిన్ , ఎరిక్ ఎబౌనీ కీలక పాత్రలు పోషించారు. దీనిని తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.
Also Read : Hero Jr NTR :జన్మంటూ ఉంటే చెఫ్ గా పుట్టాలని ఉంది