Kushi Movie Team Visit : శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషీ దుమ్ము రేపుతోంది. రూ.100 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళుతోంది. ఖుషీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో చిత్రానికి చెందిన యూనిట్ తెగ సంతోషానికి లోనవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో బిగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కూడా కట్ చేశారు.
Kushi Movie Team Visit Temples
తన చిత్రాన్ని ఆదరించినందుకు , సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). మంగళవారం నటుడు చిత్ర యూనిట్ తో కలిసి విశాఖపట్టణంకు చేరుకున్నారు. అక్కడ పేరు పొందిన సింహాచలం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు సాదర స్వాగతం పలికారు నటుడికి.
ఈ సందర్భంగా స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం విజయ్ దేవరకొండకు ఆశీర్వాదం అందజేశారు అర్చకులు. ఆలయ కమిటీ నటుడిని సన్మానించి, స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ను అభినందించారు.
స్వామి వారి కృప, మీ అందరి ఆదరాభిమానాలు తనను ఇంతటి వాడిని చేశాయని, ఖుషిని ఊహించని రీతిలో సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ తెలిపారు విజయ్ దేవరకొండ.
Also Read : Golden Ticket : బిగ్ బికి గోల్డెన్ టికెట్