Kushi Kapoor : ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం నాదానియన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన సూపర్ సాంగ్ గలాత్ ఫెహ్మీ రిలీజ్ అయ్యింది. విడుదలైనప్పటి నుంచి దుమ్ము రేపుతోంది. భారీ ఆదరణ చూరగొంటోంది. సైఫ్ అలీ ఖాన్ , అమృతా సింగ్ ల కుమారుడే ఈ ఖాన్. ఇక ఖుషీ కపూర్(Kushi Kapoor) ఎవరో కాదు దివంగత అందాల తార శ్రీదేవి , బోనీ కపూర్ తనయనే ఈ ఖుషీ కపూర్. ఇద్దరికీ ఈ నాదానియన్ మూవీ అత్యంత కీలకం. ఫోకస్ అంతా కెరీర్ పై పెట్టారు ఈ ఇద్దరు.
Kushi Kapoor-Ibrahim Ali Khan
ఇది నెట్ ఫ్లిక్స్ చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం రెండో పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. గలాత్ ఫెమ్మీ అనే పేరుతో రిలీజైన పాట గుండెలను హత్తుకునేలా ఉంది. హృదయ విదారకం, విడి పోవడం అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది.
ఈ సాంగ్ ను ప్రముఖ సంగీత సంస్థ సనీ మ్యూజిక్ తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ లో మనోహరమైన పాటను ఆవిష్కరించింది. ఇందులో ఖుషీ, ఖాన్ లు తమ భావోద్వేగాలను పండించేందుకు ప్రయత్నం చేశారు. ప్రారంభ సన్నివేశంలో పియా కళాశాల ప్రాంగణంలో ఓదార్పు లేకుండా ఏడుస్తుండగా, అయిష్టంగా ఉన్న అర్జున్ కన్నీరు కారుస్తూ ఆమె నుండి దూరంగా నడుస్తున్నాడు. వారి పేరెంట్స్ సైతం తమను ఓదార్చేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ పట్టించుకోరు. మొత్తంగా దర్శకుడు చిత్రీకరించిన పాట యూత్ ను ఆకట్టుకుంటోంది. కన్నీళ్లు పెట్టిస్తోంది.
Also Read : Beauty Ameesha Patel :అమీషా ఫిర్ కహో నా ప్యార్ హై