Kushi Celebrations : ఖుషీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్

ఇది ఊహించ‌ని విజ‌యం

Kushi Celebrations : శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖుషీ చిత్రం బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ల‌వ్లీ బ్యూటీ స‌మంత క‌లిసి న‌టించిన ఖుషీ చిత్రం ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. కేవ‌లం 3 రోజుల్లోనే ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. అమెరికాలో భారీ ఎత్తున ఖుషిని ఆద‌రించారు. యూత్ ఎక్కువ‌గా అట్రాక్ట్ అయ్యారు.

Kushi Celebrations Viral

శివ నిర్వాణ స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఖుషీ(Kushi) మ్యూజిక‌ల్ గా హిట్ గా నిలిచింది. ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు, మ‌న‌సు దోచుకునే మాట‌లు, వెంటాడే పాట‌లు ఖుషి చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఖుషీ రూ. 100 కోట్లు దాటేందుకు ప‌రుగులు తీస్తోంది.

పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన లైగ‌ర్ డిసాస్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ఖుషీ. గీత గోవిందంలో న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు కొట్టేసిన విజ‌య్ కు ఈ సినిమా ఫీల్ గుడ్ ను క‌లుగ చేసింది. న‌టి స‌మంత ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఆమె సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప ది రైజ్ లో ఐటం సాంగ్ కు ఒప్పుకుంది. ఆ పాట సినిమాకు హైలెట్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా స‌మంత పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. తాజాగా మైత్రీ మూవీస్ ఆధ్వ‌ర్యంలో ఖుషీ బ్లాక్ బ‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్ ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కేక్ క‌ట్ చేశారు.

Also Read : Anupama Parameswaran Vs Kiara Advani

Comments (0)
Add Comment