Kushboo : ఆ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తిం చారంటున్న ‘కుష్బూ’

గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ వేడుకల్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ పాల్గొన్నారు...

Kushboo : ఇటీవల జస్టిస్ హేమ కమిటీ నివేదికపై స్పందించిన నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బూ.. తాజాగా గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్‌లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన కెరీర్ తొలినాళ్లలో ఓ హీరో తన పట్ల ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడో.. ఖుష్బూ(Kushboo) ఈ వేదికపై చెప్పుకొచ్చారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై స్పందించిన సమయంలో తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు.. కన్న తండ్రే తనను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చిన ఖుష్బూ(Kushboo).. ఇప్పుడు ఓ హీరో తనని ఎంతగా ఇబ్బంది పెట్టాడో చెప్పుకొచ్చారు.

Kushboo Comments

గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ వేడుకల్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయని.. ఒకానొక సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ‘‘గతంలో ఓ సినిమా సెట్లో ఒక హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు. నాకు ఏదైనా ఛాన్స్ ఉందా అన్నాడు. వెంటనే నేను నా చెప్పుల సైజు 41. ఇక్కడే చెంప పగలకొట్టనా లేదా సెట్లో అందరి ముందు పగలకొట్టనా అని అడిగా’’నని తెలిపారు.

సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని తాను పరిశ్రమలోకి వచ్చానని.. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది తన సిద్ధాంతమని అలానే తాను పని చేసినట్లు ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కొందరు ఇంతకీ ఎవరా హీరో? అని ఆలోచిస్తూ.. ఖుష్బూ ఫిల్మోగ్రఫీని తిరగేస్తున్నారు. ఆ హీరో ఎవరనేది పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీలో అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటం మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. మరి సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అంశంపై ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.

Also Read : Laggam Movie : ఓటీటీలో అలరిస్తున్న ఫ్యామిలీ మూవీ ‘లగ్గం’

BreakingCommentsKushboo SundarViral
Comments (0)
Add Comment