Kunal Thakur: పెళ్ళిపీటలెక్కిన ‘యానిమల్‌’ నటుడు

పెళ్ళిపీటలెక్కిన 'యానిమల్‌' నటుడు

Kunal Thakur: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కునాల్‌ ఠాకూర్‌ పెళ్ళి పీటలెక్కారు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా హిందీలో దర్శకత్వం వహించిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన కునాల్… బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డ్యాన్సర్, నటి ముక్తి మోహన్‌ను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఢిల్లీలోని ఘనంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను అటు కునాల్… ఇటు ముక్తి మోహన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ అభిమానుల ఆశీస్సులు కోరారు. దీనితో పలువురు సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Kunal Thakur Will Got Married

సందీప్‌ వంగా దర్శకత్వంలో ఇటీవల విడుదలైన యానిమల్‌(Animal) సినిమాలో… హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకునే అబ్బాయిగా కునాల్‌ కనిపించాడు. ముక్తి మోహన్‌ కూడా బాలీవుడ్‌లో నటనతోపాటు ఆమె మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ ‘దరువు’ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించింది. లస్ట్‌ స్టోరీస్‌ 2, థార్‌ వంటి సినిమాల్లో కూడా ఆమె మెప్పించింది. దిల్ హై హిందుస్తానీ 2 బుల్లితెర ప్రోగ్రామ్‌లో ఆమె హోస్ట్‌గా కనిపించింది.

Also Read : Samantha: కొత్త అవతారమెత్తిన సమంత

kunal thakurmukthi mohan
Comments (0)
Add Comment