Kumbhasthalam : విడుదలైన కుంభస్థలం పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల హృదయాలను మరింత ఆలోచింప చేసేలా ఉందంటున్నారు సినీ క్రిటిక్స్. టెక్నాలజీలో చోటు చేసుకున్న కీలకమైన మార్పులు ఇప్పుడు సినిమా రంగానికి ఊపిరి పోసేలా చేశాయి. ఏకేఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజార్ షేక్ దీనిని నిర్మిస్తున్నారు.
Kumbhasthalam Movie Effective Poster
సినిమాను మరింత రిచ్ గా తీసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు దర్శకుడు రాకీ శర్మన్. అర్చన, దివి, ప్రభాకర్ బాహుబలి, అజయ్ ఘోష్ , నాగ మహేష్, బలగం సంజయ్, చిత్రం శ్రీను, వినోద్ కుమార్ ఆల్వ, దిల్ రమేష్ , తదితరులు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రిలీజ్ చేసిన వెంటనే కుంభ స్థలం మూవీ పోస్టర్ కు భారీ ఆదరణ లభించింది. సినిమా షూటింగ్ ఇప్పటి దాకా హాఫ్ వరకు పూర్తయిందని తెలిపారు దర్శకుడు . ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామన్నారు. పాన్ ఇండియా మూవీగా దీనిని తీర్చిదిదే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Also Read : Hero Rajinikanth-Jailer 2 : నెట్టింట వైరల్ అవుతున్న ‘జైలర్ 2’ టీజర్