Kumbh Mela- Sensational Floating :కుంభ మేళా ఉత్స‌వం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

60 కోట్ల‌కు పైగా భ‌క్తుల పుణ్య స్నానం

Kumbh Mela : ఉత్త‌ర ప్ర‌దేశ్ – మ‌హా కుంభ మేళా 2025 ఆధ్యాత్మిక మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతోంది. త్రివేణి సంగ‌మం వ‌ద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. దీంతో ఇంకా కొన్ని రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో దేశం న‌లుమూలల నుంచి భ‌క్తులు పోటెత్తారు.

Kumbh Mela Floating

12 ఏళ్ల‌కు ఒక‌సారి ఈ కుంభ మేళా కొన‌సాగుతుంది. అల‌హాబాద్ లోని ప్ర‌యాగ్ రాజ్ భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతోంది. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం క్రిక్కిసి పోయారు. యూపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హా కుంభ మేళా మ‌హోత్స‌వానికి 60 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేశార‌ని, ఇంకా పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. ఈ మ‌హా కుంభ మేళా గ‌త జ‌న‌వ‌రి నెల 13న ప్రారంభమైంది. ఈనెల 26కు కొన‌సాగ‌నుంది.

దేశంలో 110 కోట్ల మంది హిందువులు ఉన్నార‌ని ఇప్ప‌టికే స‌గానికి పైగా పుణ్య స్నానాలు చేశార‌ని స్ప‌ష్టం చేశారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ఈ సంఖ్య 65 కోట్ల‌కు పైగానే చేరుకుంటుంద‌ని అంచ‌నా వేశారు. మ‌హా శివ రాత్రి వ‌ర‌కు కొన‌సాగుతుంది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు, అనేక మంది అంతర్జాతీయ అతిథులు పుణ్య‌ స్నానం చేశారని తెలిపింది.

Also Read : IND vs PAK Interesting Match :పాకిస్తాన్ భార‌త్ నువ్వా నేనా

Kumbh MelaUpdatesViral
Comments (0)
Add Comment