Kubera: ముంబైలో ‘కుబేర’ షూటింగ్ !

ముంబైలో ‘కుబేర’ షూటింగ్ !

Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో… ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘కుబేర’. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ సన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన వచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సామాజిక అంశాలను స్పృశిస్తూ… ధనుష్(Dhanush), నాగార్జునలను మునుపెన్నడూ చూడని యాక్షన్ మోడ్ లో చూపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో తేట తెల్లమయింది. దీనితో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Kubera Movie Updates

‘కుబేర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల బ్యాంకాక్‌ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ తన మకాంను ముంబైకు మార్చింది. ముంబైలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దాదాపు రెండు వారాల పాటు ముంబైలోనే ఈ సినిమా షూటింగ్ జరపుకోనున్నట్లు తెలుస్తోంది. ముంబై షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల అభిమానులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Preity Zinta: ఆరేళ్ళ తరువాత సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా రీ ఎంట్రీ !

akkineni nagarjunadanushKubera
Comments (0)
Add Comment