Kriti Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తళుక్కున మెరిసింది బాలీవుడ్ ముద్దు గుమ్మ కృతి సనన్(Kriti Sanon). తన సినీ కెరీర్ లో తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంపకి చేసుకుంటోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను కథ బాగుంటేనే ఓకే చెబుతోంది. లేకుంటే సున్నితంగా తిరస్కరిస్తోంది. ఈ లవ్లీ బ్యూటీ తాజాగా దక్షిణాదిలో మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన తమిళ సినీ రంగానికి చెందిన హీరో ధనుష్ తో జత కడుతోంది. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Kriti Sanon Movie Updates
ఇద్దరి జోడి సూపర్ గా ఉంటుందని సినీ క్రిటిక్స్ సైతం పేర్కొంటున్నారు. కృతి సనన్ మంచి డ్యాన్సర్ కూడా. ఆ మధ్యన జాకీ ష్రాఫ్ తనయుడితో సూపర్ షో చేసింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా ఈ నటి సందడి చేస్తుంది. డార్లింగ్ తో జత కట్టినా అంతగా వర్కవుట్ కాలేదు ఆది పురుష్ మూవీ. అయినా తనకు లెక్కలేనన్ని సినిమాలలో ఛాన్స్ లు వచ్చాయి.
కానీ సెలెక్టివ్ గా నే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది బాలీవుడ్ భామ. ఇక ధనుష్ విషయానికి వస్తే తను 2013లో వచ్చిన రాన్ జానా లవ్ స్టోరీ మూవీ జనాదరణ పొందింది. ఆ తర్వాత నటిస్తున్న హిందీ చిత్రం తేరే ఇష్క్ మే కావడం విశేషం. ఇందులో కృతి సనన్ కీ రోల్ లో నటిస్తోంది. దీనికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. టి సీరీస్ పతాకం పై దీనిని నిర్మిస్తున్నారు.
Also Read : Sana Shaikh Shocking : కాస్టింగ్ కౌచ్ పై సనా షేక్ కామెంట్స్