Kriti Sanon : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ తో జత కట్టడానికి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఆరాట పడుతోంది. ‘మిమి’ సినిమాకు ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక అయిన కృతి సనన్… ఇటీవల జాతీయ అవార్డుల వేడుకలో బన్నీతో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా కృతి సనన్ కు అభినందిస్తూ బన్నీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు స్పందిస్తూ… ‘‘మీతో కలిసి నటించాలని ఉంది’’ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ పోస్టుపై బన్నీ అభిమానులతో పాటు కృతి సనన్ అభిమాననులు కూడా హర్షం వ్యక్తం చేసారు. మీ ఇద్దరి జాతీయ నటుల కలయక కోసం మేము కూడా ఈగర్ గా వెయిటింగ్ అంటూ కామెంట్లు పెట్టారు.
Kriti Sanon – ఎవరైనా పుణ్యం కట్టుకోండి అంటూ డైరక్టర్స్ ను వేడుకుంటున్న కృతి
అయితే బన్నీతో సినిమా చేయాలన్న తన కోరికను మరోసారి బయటపెట్టింది కృతి సనన్(Kriti Sanon). “అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పనిచేసే క్షణం కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా” అంటూ మరోసారి తన మనసులో కోరికను బయట పెట్టింది కృతి సనన్(Kriti Sanon). అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీతో కలిసి నటించాలని ఉందని కృతి చెప్పడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో కృతి సనన్ కామెంట్స్‌కి ఏకీభవిస్తూ ఫ్యాన్స్ సైతం మీకు కచ్చితంగా బన్నీతో నటించే ఛాన్స్ వస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
1 నేనొక్కడినే… దోచేయ్… ఆదిపురుష్ నెక్స్ట్ బన్ని సినిమా
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు కధాయాయకుడిగా ‘1 నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్… ఆ తరువాత అక్కినేని నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించింది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించింది. హిందీలో హీరోపంతి, పానిపట్, పతి పత్ని ఔర్ వో, మిమి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నఈమె ఇటీవల నిర్మాతగా మారి “మహిళా ప్రాధాన్యం ఉన్న ‘దో పత్తి’ అనే సినిమా నిర్మిస్తోంది. ఓవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కృతి…. తాను నటించిన మిమి సినిమాకు ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైయింది.
Also Read : Pragathi: పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన నటి ప్రగతి