Kriti Kharbanda : తెలుగుతో పాటు కన్నడ మరియు హిందీ వంటి భాషలలో తన నటనకు ప్రసిద్ది చెందిన ప్రముఖ నటి కృతి ఖర్బందా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆమె తన స్నేహితుడు పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి 7 అడుగులు నడిచింది. వేడుక ముగిసిన తరువాత, వధూవరులు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Kriti Kharbanda Marriage Updates
కృతి మరియు పుల్కిత్ సామ్రాట్ ఢిల్లీలోని ఐటీసీ గ్రాండ్ హర్ భారత్‌లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
కృతి మరియు పుల్కిత్ ఇద్దరూ ఢిల్లీకి చెందినవారు. అందుకే వీరి పెళ్లి ఢిల్లీలో జరిగింది. ఈ చిత్రాలను పంచుకుంటూ కృతి భావోద్వేగానికి గురైంది. ‘పాగల్‌పంటి’ సెట్స్‌లో కృతి(Kriti Kharbanda) మరియు పుల్కిత్ మొదటిసారి కలుసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో వీరి నిశ్చితార్థం జరిగింది.
కృతి ఖర్బందా 2009లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.తెలుగులో పవన్ కళ్యాణ్ హీరొగా ‘తీన్ మార్’ మరియు మనోజ్ దర్శకత్వం వహించిన ‘మిస్టర్ నోకియా’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. మరియు రామ్ పోతినేని “ఒంగోలు గిత్త”. బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ సోదరిగా కూడా నటించింది.
Also Read : Karthikeya 3 : కార్తికేయ 3 సినిమా పై సరికొత్త అప్డేట్ ఇచ్చిన హీరో నిఖిల్