Krithi Shetty : టాలీవుడ్ లో టాప్ దర్శకులలో ఒకడిగా పేరు పొందాడు శ్రీకాంత్ ఓదెల. టేకింగ్ , మేకింగ్ లో తనదైన శైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తను నానితో తీసిన దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సమయంలో నేచురల్ స్టార్ నానితో దమ్మున్న కథతో ముందుకు వస్తున్నాడు. ది ప్యారడైజ్(Paradise) తీస్తున్నాడు. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ దుమ్ము రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకు పోతోంది.
Krithi Shetty in Paradise Movie
తాజాగా చలన చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి(Krithi Shetty). ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవీ వర్కవుట్ కాలేదు బేబమ్మకు. శర్వానంద్ తో కలిసి మనమే చిత్రం చేసినా అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఆ ఛాన్స్ లు లక్ వల్ల వచ్చాయని ప్రచారం జరిగింది. తాజాగా మరో టాక్ కొనసాగుతోంది. నేచురల్ స్టార్ నానితో బేబమ్మను కన్ ఫర్మ్ చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా నానితో గతంలో శ్యామ్ సింగరాయ్ లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుందని ప్రచారం ఉంది. దీంతో శ్రీకాంత్ ఓదెల తనతో నటింప చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు తనకు కూడా కాలిషీట్స్ లేక పోవడంతో ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే మూవీ మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రిలీజ్ కాలేదు. బేబమ్మను తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : Rashmika Shocking :సినిమాను సేవ్ చేయని నటి చరిష్మా