Krishnamma: సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’ !

సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’ !

Krishnamma: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ(Krishnamma)’. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాలో సత్యదేవ్ సరసన అతీరా రాజ్ హీరోయిన్ గా నటించగా… లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ గా ఈ నెల 10న ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన హీరో సత్యదేవ్… ఆశించిన విజయం అందుకోలేకపోయినా… ఫరవాలేదు అనిపించారు. అయితే ఈ సినిమా విడుదలై సరిగ్గా వారం అయ్యేసరికి… సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Krishnamma – కథేమిటంటే ?

అనాథలైన భద్ర (సత్యదేవ్‌), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ మీసాల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకొచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుంటారు. వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్‌)తో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్‌ కు రూ.2లక్షలు అవసరమైతే… ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్లు పాడేరు నుంచి వైజాగ్‌కు గంజాయి తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్లు అనుకోకుండా ఓ యువతి అత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read : Prasanna Vadanam: ఓటీటీలోనికి ‘ప్రసన్నవదనం’ !

amazon primeKrishnammaSatya Dev
Comments (0)
Add Comment