Popular Director Krishna Vamsi :ప్రేమ క‌థ‌పై కృష్ణ వంశీ ఫోక‌స్

రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ

Krishna Vamsi : టాలీవుడ్ లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ(Krishna Vamsi) రూటు మార్చాడా. లేదు సినిమా ట్రెండ్ కు త‌గిన‌ట్టుగా త‌ను కొత్త క‌థ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు టాక్. ఏది ఏమైనా త‌ను తీసే టెక్నిక్ వేరు. త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్టుగా సినిమాలు తీస్తాడు. లేదంటే మౌనంగా ఉంటాడు. కాంట్రావ‌ర్సీస్ కు పోడు. త‌నేదో త‌న ప‌నేదో. ఆయ‌న ఆర్జీవీ టీంలోని స‌భ్యుడు. ఇది ప‌క్క‌న పెడితే ఆ మ‌ధ్య‌న మ‌రాఠా లో పేరు పొందిన నాట‌కాన్ని రంగ మార్తాండ పేరుతో తీశాడు. ఇది ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోయే సినిమా. ఇందులో ప్ర‌కాశ్ రాజ్, బ్ర‌హ్మానందం పోటీ ప‌డి న‌టించారు. ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన చిత్రం.

Krishna Vamsi New Movie

కాగా ఆ చిత్రం ఆశించినంత‌గా ఆడ‌లేదు. అయినా ఎక్క‌డా నిరాశ‌కు గురి కాలేదు. త‌న లోకం వేరు . కృష్ణ‌వంశీ అంటేనే ఓ మార్క్. ఓ బ్రాండ్. త‌న చిత్రంలో చిన్న పాత్ర అయినా దొరికితే చాలు అనుకునే న‌టీ న‌టులు ఎంద‌రో. ఎందుకంటే త‌నే ఓ స్కూల్. త‌నే నిర్మించాడు. చేతులు కాలినా సినిమా మీద ఉన్న పేష‌న్ తో త‌ను సినిమాల‌పైనే దృష్టి సారించాడు. తాజాగా పూర్తిగా ప్రేమ‌, రొమాంటిక్ , కామెడీ డ్రామాతో కూడిన క‌థ‌లను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం.

కొత్త‌గా రాబోయే చిత్రం పూర్తిగా సిట్యుయేషన్‌షిప్ , బెంచింగ్ , త‌దిత‌ర కీ పాయింట్స్ ఆధారంగా సినిమా తీయ‌బోతున్నాడ‌ని వినికిడి. ఇదిలా ఉండ‌గా కృష్ణ‌వంశీ అంటేనే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది గులాబీ, సింధూరం, అంతః పురం, మురారి, నిన్నే పెళ్లాడ‌తా, ఖ‌గ్డం వంటి సినిమాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌తాయి. వీటికి మించిన మంచి ప్రేమ క‌థ‌తో ముందుకు రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిసింది. మొత్తంగా కృష్ణ వంశీ నుంచి వ‌చ్చే ఆ మూవీ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : Beauty Tamannaah-Raid 2 :ఐటం సాంగ్ లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా 

CommentsDirectorKrishna VamsiUpdatesViral
Comments (0)
Add Comment