Koti : సుస్వరాల మాంత్రికుడిగా జగమెరిగిన సంగీత దర్శకుడిగా పేరొందాడు కోటి. గతంలో రాజ్ కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలతో విడి పోయారు. రాజ్ అనారోగ్య కారణాలతో లోకాన్ని వీడారు. కానీ కోటి మాత్రం ఇంకా తనదైన ముద్ర కనబరుస్తూ వస్తున్నారు. బుల్లితెరపై ప్రాయోజిత కార్యక్రమాలకు హోస్ట్ గా ఉన్నారు. అంతే కాదు జీ సరిగమప షో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోటి(Koti) అంటేనే పసందైన, హుషారైన సంగీతానికి పెట్టింది పేరు.
Koti New Song Updates
గతంలో సినిమాలకే కాదు ఎన్నో ఆల్బమ్స్ కు కూడా ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారికి సంబంధించి వాసవి సాక్షాత్కారం పేరుతో కొత్త ఆల్బమ్ ను రూపొందించాడు. దీనికి సంబంధించి అమ్మా నీ చరితం పేరుతో పాన్ ఇండియా సింగర్ గా గుర్తింపు పొందిన కైలాష్ ఖేర్ తో పాడించాడు.
తను అమ్మా నీ చరితం అంటూ పాడిన పాట ఇప్పుడు సంగీత అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరుకు భక్తి గీతమే అయినా టాప్ లో కొనసాగుతుండడం విశేషం. విడుదలైన ఈ ఆల్బం కొన్ని నిమిషాల్లోనే నెంబర్ చార్ట్స్ లోకి దూసుకు వెళ్లడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా కోటి, ఖేర్ ల ద్వయం మరో రికార్డ్ సృష్టించేందుకు రెడీ అయ్యారు.
Also Read : Anil Ravipudi Sensational : బెస్ట్ ఫ్రెండైనా ఛాన్స్ ఇవ్వలేక పోయా