Konidela Upasana: ‘ఒక కల నెరవేరిన వేళ’ అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్ !

'ఒక కల నెరవేరిన వేళ' అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్ !

Konidela Upasana: సినిమా హీరోయిన్ కాకపోయినా సెలబ్రెటీ స్టాటస్ పొందిన వ్యక్తి మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, రామ్ చరణ్ భార్యగా, అపోలో హాస్పటల్స్ లో భాగస్వామిగా వివిధ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్న ఉపాసన… ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన తాతయ్య అపోలో ప్రతాప్ రెడ్డి, నానమ్మలతో పాటు కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య శ్రీ రామ మందిరాన్ని సందర్శించారు. అక్కడ బలరాముని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా తన అయోధ్య పర్యటనకు సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియోను తన సోషల్ మీడియా వేదిక ఇన్‌ స్టాలో పోస్ట్ చేసింది మెగా కోడలు ఉపాసన(Konidela Upasana). ప్రస్తుతం ఆ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్ గా మారుతోంది.

Konidela Upasana Post Viral

కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య పర్యటకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఉపాసన… తన కోరిక తీరిందని… ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన… దివ్యమైన అనుభూతి అని తెలిపింది. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని రాసుకొచ్చింది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మెగా కుటుంబంతో పాటు… అపోలో కుటుంబం బరువు, బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్ !

Apollo HospitalsKonidela Upasanaram charan
Comments (0)
Add Comment