Konidela Surekha: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అన్న చిరంజీవి, వదిన సురేఖకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ అన్నా పవన్ కు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వీరిద్దరి మధ్య విభేధాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇటు ఏపీలో అటు కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించడం… ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు స్థానం దక్కించుకోవడంతో ఆ ఆనందాన్ని అన్న, వదినలతో పవన్ కళ్యాణ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం… యావత్ ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా నిలిచింది.
Konidela Surekha Gift..
ఢిల్లీలో ఎన్డీయే పక్షాల భేటీ తర్వాత చిరంజీవి(Chiranjeevi) దంపతులను కలిసిన పవన్ కళ్యాణ్ వారితో గడిపిన ఆనంద క్షణాలు మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్న, వదినలను తల్లిదండ్రులతో సమానంగా భావించిన పవన్ కళ్యాణ్… వారికి సాష్టాంగ నమస్కారం చేసారు. దీనితో ప్రధాని మోదీ సైతం ఆ బంధానికి ఫిదా అయ్యారు.
పవన్ కళ్యాణ్ ఎదుగుదలలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మెగాస్టార్(Chiranjeevi) దంపతులు… పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు కేబినెట్ లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక… ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు తర్వాత పవన్ కళ్యాణ్ అన్న, వదినలను కలిశారు. ఈ సందర్భంగా వదిన సురేఖ పవన్‌కు ఓ బహుమతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి పేరుతో చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్‌కు సురేఖ ఓ ఖరీదైన పెన్నును బహుమతిగా అందించారు.
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్నును సురేఖ బహుమతిగా అందించారు. ఈ పెన్నును స్వయంగా సురేఖ పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా.. పవర్‌స్టార్ ఆనందంతో వదినమ్మను కౌగిలించుకుని తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే అద్బుతమైన బహుమతి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ చిరు దంపతులకు ధ్యాంక్స్ తెలిపారు. అలాగే తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ… ఆశీర్వదిస్తూ అంటూ చిరు తన వీడియో చివరిలో రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Pranaya Godari : గోదావరి అందాలు కనిపించేలా తీసిన ‘ప్రణయ గోదారి’ ఫస్ట్ లుక్