Sivakarthikeyan : శివకార్తికేయన్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో

ఎందుకంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూడడం ప్రారంభించాను...

Sivakarthikeyan : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలోను సీనియర్ స్టార్ హీరోలు విలన్ల అవతారమెత్తుతున్నారు. కొందరు లీడ్ రోల్ ఆఫర్స్ రాకపోవడంతో, మరికొందరు నటనలో వైవిధ్యతను చూపించేందుకు విలన్లుగా అవతారమెత్తి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరో ఇప్పుడు విలన్ అవతారమెత్తాడు.

Sivakarthikeyan Movie Updates

జాతీయ అవార్డు విజేత, దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం తమిళ్ యాక్టర్ శివ కార్తికేయన్(Sivakarthikeyan) 25వ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విలన్ గా స్టార్ యాక్టర్ ‘జయం రవిని’ పరిశీలించారు. దీనికి ఆయన ఓకే కూడా చెప్పేశాడు. ఇదంతా ఎలా జరిగింది అనే అనుభవాన్ని హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. “ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం జయం రవి సర్ విలన్ పాత్ర చేయడం. ఇది చాలా బలమైన పాత్ర. ఆయన ‘యస్… ఈ సినిమా చేస్తున్నాను’ అని చెప్పినప్పుడు నాకు ఎంతగానో సంతోషంగా అనిపించింది.

ఎందుకంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూడడం ప్రారంభించాను. నా కాలేజ్ డేస్ సమయంలో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు. చిత్ర పరిశ్రమలో ఆయన నాకు సీనియర్. ఆయన సినిమాలను ఎంతో ఆస్వాదించాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం, ఒకరిపై ఒకరు పోరాడే సన్నివేశాల్లో నటించడం చాలా ఉత్సాహంగా ఉంది. ఇక సుధా మేడమ్ చాలా శ్రద్ధగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అందుకే ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు. ఆమె ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారు” అన్నారు

“మేం ఈ సినిమాకి షూటింగ్ ప్రారంభించాం. రెండు రోజుల క్రితం ప్రోమో షూట్ జరిగింది. ఇంకా షూటింగ్ కొనసాగుతోంది. ఇది పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా. ఇది మరింత భారీ స్థాయిలో ఉంటుంది.ఈ సినిమాలో శ్రీలీల, అథర్వా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. రవి కె. చంద్రన్ గారు సినిమాటోగ్రాఫీ చేస్తున్నారు. మరోవైపు ఏఆర్ మురుగదాస్ గారితో చేస్తున్న నా సినిమా 90 శాతం పూర్తయ్యింది. మిగిలిన 10 శాతం, సల్మాన్ ఖాన్ తో తీస్తున్న సినిమా షూటింగ్ ముగించుకుని మురుగదాస్ గారు తిరిగి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం” అని చెప్పుకొచ్చారు.

Also Read : Anantha Sriram : గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యంపై ఘాటు విమర్శలు

Jayam RaviSivakarthikeyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment