Vijay : తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందాడు తళపతి విజయ్(Vijay). తనకంటూ ఓ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ గా రజనీకాంత్ కొనసాగుతున్నప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా విజయ్ టాప్ లో కొనసాగుతున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎందరో నటులు ఉన్నా తను వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే తను బిగ్ సెలిబ్రిటీ అయినా చాలా సింప్లిసిటీని ఇష్టపడతాడు.
Thalapathy Vijay Wishes..
ఎవరూ ఊహించని రీతిలో తను సంచలన ప్రకటన చేశాడు. రాజకీయ పరంగా తాను ఎంట్రీ ఇచ్చాడు గత ఏడాదిలో. భారత దేశ చరిత్రలో ఎవరూ ఊహించని రీతిలో తను నిర్వహించిన సభకు జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. తళపతి విజయ్ కు ప్రజలే కాదు నటీ నటులు కూడా బిగ్ ఫ్యాన్స్ గా ఉండడం విశేషం. ఇదే ఆయన ప్రత్యేకత.
పొంగల్ పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు నటుడు , పొలిటికల్ లీడర్ విజయ్. అందరూ సుఖ శాంతులతో ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో అలరారుతూ ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు కోలివుడ్ స్టార్ యాక్టర్ శ్రీమాన్. తను తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో నటించాడు. తను విజయ్ ని తన నివాసంలో స్వయంగా కలుసుకున్నాడు. ఫెస్టివల్ సందర్బంగా కంగ్రాట్స్ తెలిపాడు.
Also Read : Victory Venkatesh Hatric : సంక్రాంతికి వస్తున్నాం భారీ సంబురం