Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మెగాస్టార్ చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి. తెలుగు సినిమా రంగంలో టాప్ లో కొనసాగుతున్న చిరంజీవి గురించి తాను ఏనాడూ విమర్శించ లేదన్నారు. కొందరు పనిగట్టుకుని తనను కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కొడాలి నాని.
Kodali Nani Wishes to Mega Star
మంగళవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్బంగా కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు చేపట్టారు. ఈ సందర్బంగా కొడాలి నాని కూడా పాల్గొన్నారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం ఫ్యాన్స్ కోరిక మేరకు కొద్దిసేపు మాట్లాడారు మాజీ మంత్రి కొడాలి నాని. చిరంజీవి అంటే తనకు కూడా ఇష్టమన్నారు. తాను ఎక్కడైనా మెగాస్టార్ గురించి పల్లెత్తు మాట అని ఉంటే నిరూపించాలని జనసేన పార్టీ నేతలకు ఛాలెంజ్ చేశారు.
అనవసరంగా మనుషుల్ని బద్నాం చేసే ప్రక్రియకు పుల్ స్టాప్ పెడితే బావుంటుందని సూచించారు. పెద్దాయన చిరంజీవి సలహాలను తాను కూడా పాటిస్తానని చెప్పారు కొడాలి నాని(Kadali Nani). తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడి గాళ్లకు కూడా ఇవే సలహాలు ఇస్తే బావుంటుందని సూచించారు.
మొత్తంగా మాజీ మంత్రి కొడాలి నాని ఏది మాట్లాడినా అది సంచలనమే. ఆయన పదే పదే పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
పెద్దాయన చిరంజీవి సలహాలను తాము పాటిస్తానని, తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడీగాళ్ళకు కూడా చెప్పాలని మాత్రమే నేను చెప్పానని కొడాలి నాని అన్నారు.
Also Read : Chandrababu Naidu : చిరంజీవి కలకాలం వర్దిల్లు