KJ Yesudas : సినీ గాయక దిగ్గజం యేసుదాసు ఆరోగ్యం పదిలంగానే ఉందని స్పష్టం చేశారు తనయుడు, గాయకుడు విజయ్ యేసుదాసు. ఆయన ఇటీవల 85వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం తను అమెరికాలో ఉన్నారని, చెన్నై ఆస్పత్రిలో చేరారని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. ఆయన ఇప్పటికీ గాన సాధనలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని కోరారు.
KJ Yesudas Health Updates
గత 60 సంవత్సరాలుగా యేసు దాసు(KJ Yesudas) తన గానామృతాన్ని పంచుతూ వస్తున్నారు. తనకు అయ్యప్ప స్వామి అంటే చచ్చేంత ఇష్టం. ఆ మధ్యన ఆలయం లోపటికి అందించ లేదన్న వార్తలు సంచలనంగా మారాయి. ఆయన అసలు పేరు జేసుదాస్. తనకు ఏసు క్రీస్తు అంటే ఇష్టం. ఆ పేరునే యేసు దాసుగా మార్చేసుకున్నారు. ఎన్నో విమర్శలు కానీ అన్నింటిని తట్టుకుని తన గానంతో పాడుకుంటూ పోతున్నారు. ఇప్పటికీ 85 ఏళ్లు వచ్చినా తన ప్రాక్టీస్ మాత్రం మానడం లేదు. ఇది ఆయనకు ఉన్న ప్రత్యేకత.
కాగా యేసు దాసు ఇప్పటి వరకు తన కెరీర్ లో 50 వేలకు పైగా పాటలు పాడారు. మలయాళం, కన్నడ, హిందీ, తమిళం, మరాఠీ, అరబిక్ ..ఇలా పలు భాషల్లో తన గొంతుతో ఆకట్టుకున్నారు. అలరిస్తూ వచ్చారు యేసు దాస్. ఆయనకు పలు రాష్ట్రాలు ఎన్నో బిరుదులు, అవార్డులు, పురస్కారాలు అందజేశాయి. కేంద్ర సర్కార్ సైతం తనకు పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సత్కరించింది.
Also Read : Hero Nagarjuna-Dhanush :నాగార్జున..ధనుష్ కుబేర డేట్ ఫిక్స్