Kiss Kiss Kissak Movie Sensational :కిస్ కిస్ కిస్స‌క్ తెలుగు వెర్ష‌న్ రెడీ

హిందీ చిత్రం పింటు కీ ప‌ప్పీ

Kiss Kiss Kissak : భార‌తీయ సినిమా హ‌ద్దులు దాటేసింది. ఒక‌ప్పుడు ఆయా రాష్ట్రాల వారీగా సినిమాలు విడుద‌ల అయ్యేవి. కానీ సీన్ మారింది. టెక్నాల‌జీ మార‌డంతో ఏకంగా ద‌క్షిణాది నుంచి వ‌చ్చే మూవీస్ కోసం ఎదురు చూడ‌టం మొద‌లైంది. వీటితో పాటు ఓటీటీల హ‌వా కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న పోటీ నెల‌కొంది. దీంతో వెబ్ సీరీస్, బుల్లితెర‌, వెండితెర రాజ్యాలు ఏలుతున్నాయి. హిందీ నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం భాష‌ల‌లోకి రిలీజ్ అవుతున్నాయి.

Kiss Kiss Kissak Movie Updates

ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌ళి, ఆర్ఆర్ఆర్ , సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప దుమ్ము రేపింది. ఇక నాగ్ అశ్విన్ తీసిన క‌ల్కి బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. మ‌రో వైపు హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన మూవీస్ కూడా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా మ‌రాఠా యోధుడి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఛావా చిత్రం బిగ్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ మూవీ రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి వెళ్లింది. దీనిని తెలుగు వెర్ష‌న్ లో రిలీజ్ చేశారు. దీనికి కూడా భారీగా స్పందన వ‌చ్చింది.

తాజాగా హిందీలో తీసిన పింటు కీ ప‌ప్పీ చిత్రాన్ని తెలుగులో కిస్ కిస్ కిస్స‌క్ పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో సుశాంత్, జాన్యా జోషి(Jaanyaa Jooshi) జంట‌గా న‌టించారు. ఈ మూవీకి శివ్ మ‌రే ద‌ర్శ‌కత్వం వ‌హించారు. విధి ఆచార్య నిర్మించారు. ఈనెల 21న హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Also Read : Hero Prabhas-The Raja Saab :ప్ర‌భాస్ రాజా సాబ్ రిలీజ్ పై స‌స్పెన్స్ 

CinemaKiss Kiss KissakTrendingUpdates
Comments (0)
Add Comment