Kiran Rao: బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు(Kiran Rao) దర్శకత్వం వహించిన సినిమా “లాపతా లేడీస్”. హ్యూమర్ డ్రామాగా కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమాను రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండే కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నితాన్షి గోయల్, ప్రతిభా రాంటా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ మొదలగువారు నటించారు. ఈ సినిమా రైలు ప్రయాణంలో తమ ఉనికిని కోల్పోయిన ఇద్దరు నవ వధువుల కథ. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
Kiran Rao Comment
బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా… ఓటీటీలో మాత్రం హిట్ బొమ్మ. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 27.66 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి దర్శకురాలు కిరణ్ రావు స్పందించింది. ‘ఒక రకంగా చెప్పాలంటే ధోబి ఘాట్, లాపతా లేడీస్.. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ధోబి ఘాట్ మూవీకి ఆ కాలంలో ఓ మోస్తరు బిజినెస్ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన లాపతా లేడీస్ ఆ మూవీ కంటే వెనకబడిపోయింది. అంటే ఒకరకంగా ఫ్లాప్ అయినట్లే. కలెక్షన్ల పరంగా చూసినా సక్సెస్ కాలేకపోయింది. వందల కోట్లు కాదు కదా కనీసం రూ.30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫలితాలు ఇలా రావడానికి పూర్తి బాధ్యత నాదే!’ అని చెప్పుకొచ్చింది.
Also Read : Hero Ajith Kumar : కెజిఎఫ్ యూనివర్స్ లోకి కోలీవుడ్ అగ్ర నటుడు