KA Movie OTT : ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా

అక్కడ తెల్లవారుజామునే అమ్మాయిలు మిస్‌ అవ్వడం గమనిస్తాడు...

KA Movie : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క(Ka)’ సినిమా ఇటీవల విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్‌తో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. సినిమా విడుదల తర్వాత ఇందులో ఉన్న కంటెంట్.. సినిమాని ప్రేక్షకుల దగ్గరకు చేర్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి.. బాక్సాఫీస్‌‌ను కళకళలాడించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు చేరవయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికను, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. రెండు మూడు రోజులుగా ‘క(Ka)’ ఓటీటీ విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘క’ ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నట్లుగా హింట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించేశారు.

KA Movie OTT Updates

ఇంతకీ‘క’ మూవీ ఏ ఓటీటీలో అనుకుంటున్నారా? ‘క(Ka)’ మూవీ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’లో నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ స్పెషల్ వార్త కూడా సదరు ఓటీటీ సంస్థ విడుదల చేయడం విశేషం. ఈ సినిమాను డాల్బీ విజన్ అట్మాస్‌లో ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈటీవీ విన్ సంస్థ ప్రకటించింది. నూతన దర్శకుడు సుజిత్ సందీప్ దర్శకత్వంలో దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టిన విషయం తెలిసిందే.

‘క’కథ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్‌ (కిరణ్‌ అబ్బవరం) ఓ అనాధ, తన తల్లిదండ్రుల జాడ తెలుసుకోవాలని తపన పడుతుంటాడు. ఎవరూ లేని అతనికి గురునాధం (బలగం జయరామ్‌) ఆశ్రయమిస్తాడు. చిన్నప్పటి నుంచి వాసుదేవ్‌‌కి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ ఉత్తరాల రాతల్లో తాను పొగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటూ ఉంటాడు. గురునాధం మాస్టర్‌కు వచ్చిన ఉత్తరం చదివాడన్న కోపంతో అతన్ని దండిస్తాడు. అంతే అక్కడున్న డబ్బు తీసుకుని ఆశ్రమం నుంచి పారిపోయి కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్‌ పోస్ట్‌మెన్‌గా చేరతాడు.

అక్కడ తెల్లవారుజామునే అమ్మాయిలు మిస్‌ అవ్వడం గమనిస్తాడు. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌‌కు మిస్సింగ్‌ కేసులకు సంబంధించి ఓ విషయం తెలుస్తుంది. ఆ క్రమంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అసలు క్రిష్ణగిరిలో అమ్మాయిలు తప్పిపోవడానికి కారణమేంటి? అభినయ్‌ వాసుదేవ్‌ ఓ చీకటి గదిలో బంధీగా ఎందుకు ఉన్నాడు. లాలా, అబిద్‌ షేక్‌ల వ్యవహారమేంటి? అభినయ్‌తోపాటు, చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్‌) ఎవరు? వీరిద్దరి జీవితంలోకి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్‌ – సత్యభామ ప్రేమ కథ ఏమైంది? ఈ చీకటి గది నుంచి అభినయ్‌, రాధ బయటపడ్డారా లేదా? అన్నది సినిమా ఇతివృత్తం.

Also Read : Nayanthara : నయనతార పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ ప్రముఖ నటి

CinemaKa MovieKiran AbbavaramOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment