Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం దీపావళి స్పెషల్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, టికెట్స్ డిమాండ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే ఇదే జోరులో మరో సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ‘క’ సినిమా ముందు వరుస సినిమాలతో ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగించిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఉపయోగించనున్నాడా. ఎందుకో కాస్త తేడా కొడుతోందని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Kiran Abbavaram Movie Updates
‘క’ రిజల్ట్ తర్వాత కిరణ్ స్టైల్‌లో మార్పు వస్తోందని అంత భావించారు. అయితే ఆయన పాత వేగంతోనే మరో సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు.. ‘దిల్ రుబా’. హీరోయిన్‌గా రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో నటించింది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ లవ్ స్టోరీని రూపొందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 24, 2025లో రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా ‘క’ సినిమా కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది.
గతేడాది ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అప్పుడు కిరణ్ మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో ఆయన ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ‘క’ మార్కెట్ లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. ‘క’ సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు కొన్ని మిస్టేక్స్ చేశాను, వాటిని సరిదిద్దుకుంటూ సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత ‘క’ సినిమా చేశానని” చెప్పాడు. అయితే ఆయన గతంలో నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ.. వరుస ప్లాప్స్‌తో ట్రోల్ అయినా విషయం తెలిసిందే.
Also Read : Manchu Vishnu : మంచు విష్ణు కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ