Kingdom of the Planet of the Apes: చాలాకాలం తర్వాత ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కింగ్‌డమ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఓటీటీలోనికి వచ్చేస్తోంది. సుమారు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ నిర్మించిన ఈ హాలీవుడ్ సినిమా మే10న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 3వేల కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. మన దేశంలోనూ రూ 10 కోట్లకు నైగానే వసూళ్లు దక్కించుకుంది. 2017లో వచ్చిన వార్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Kingdom of the Planet of the Apes) సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీకి వెస్ బాల్ దర్శకత్వం వహించగా ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Kingdom of the Planet of the Apes…
ఇప్పుడీ సినిమా ఆగస్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. మొదటి రెండు, మూడు భాగాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సిరీస్ లో 4 వ భాగంగా వచ్చిన ఈ సినిమాను అంతకుమించి అనేలా కథ, కథనాలతో, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించారు. విజువల్స్ కూడా కట్టి పడేస్తాయి. క్లైమాక్స్‌లో నోవా చేసిన పని ఆకట్టుకుంటుంది. సినిమా అసాంతం మంచి ఒమోషన్ కూడా కంటిన్యూ అవడమే కాక ఒకటి రెండు సన్నివేశాల్లో హీరో ఎలివేషన్ గూస్ బంప్స్ కూడా తెప్పిస్తుంది. సో హాలీవుడ్ సినీ లవర్స్, యాక్షన్ ప్రియులు ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయకండి ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారు.
ఇక ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Kingdom of the Planet of the Apes)’ సినిమా నేపథ్యానికి వస్తే… భూమిపై మానవుల సంఖ్య తగ్గి ఏప్స్ పరిపాలన ఏస్తుంటాయి. ఈ క్రమంలో ఏప్స్‌కు స్వాతంత్య్రం తీసుకువచ్చిన సీజర్ చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఏప్స్ అనేక వంశాలుగా రూపాంతరం చెంది చాలా ప్రాంతాలలో తమ వంశాలతో కుటుంబాలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా నివసిస్తుంటాయి. అక్కడ ఓ నోవా అనే యువ చింపాంజీ తమ వంశం అనవాయితీ ప్రకారం ఎంతో కష్టపడి తీసుకు వచ్చిన గరుడ పక్షి గుడ్డు మానవ జాతికి చెందిన మహిళ వళ్ల పగిలిపోతుంది. మరలా అలాంటి గుడ్డును తీసుకువచ్చేందుకు నోవా అడవిలోకి వెళ్లగా అక్కడ కొన్ని అనుమానాస్పందగా కొన్ని ఘటనలు ఎదురవుతాయి.
ఆదే సమయంలో నియంత ప్రాక్సిమస్ పాలనలో జనరల్ సిల్వా సారథ్యంలోని ఏప్స్ గొరిల్లా సైన్యం నోవా ఊరిపై దాడి చేసి తన తండ్రిని చంపేసి అక్కడ ఉన్న వారిని బలవంతంగా బంధించి తమ రాజ్యానికి తీసుకెళతాయి. దీనితో నోవా తన వారిని రక్షించుకునేందుకు ఒక్కడిగా బయలుదేరుతాడు. ఈ క్రమంలో తనకు మహిళ తిరిగి కలవడం, ప్రాక్సిమస్ రాజ్యానికి వెళతారు. అక్కడ నోవారాక్సిమస్‌ను ఎలా ఎదుర్కొంది, అసలు మహిళ నోవాతో ఎందుకు వచ్చింది, నోవా తన వారిన ఎలా రక్షించుకున్నాడనే ఆసక్తికరమైన స్క్రాన్‌ప్లే సాగుతూ సినిమా చూస్తే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్‌ను ఇస్తుంది.
Also Read : Nandamuri Balakrishna: ఆకట్టుకుంటోన్న బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణ వేడుకల ఆహ్వాన పత్రిక !