King Nagarjuna : నాగ చైతన్య, శోభితల పెళ్లి పై కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు

అలాంటి ప్రదేశంలో తన పెళ్లి జరగాలని నాగచైతన్య కోరాడు...

King Nagarjuna : యువసామ్రాట్ నాగ చైతన్య, థండరింగ్ బ్యూటీ శోభితల విహహం డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో‌ గ్రాండ్‌గా జరగబోతోన్న విషయం తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నిశ్చితార్థ ఫొటోలతో రివీల్ చేసిన నాగార్జున(King Nagarjuna) మరోసారి.. చైతూ-శోభితల పెళ్లి గురించి నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ పెళ్లి ఎలా జరగబోతోంది, పెళ్లి వేదిక గురించి పలు ఆసక్తికర విషయాలను నాగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. ‘‘తమ పెళ్లిని సింపుల్‌గా చేయాలని నాగ చైతన్య(Naga Chaitanya) కోరాడు. నాగచైతన్య – శోభితల(Sobhita) పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే, అది కేవలం ఒక స్టూడియో మాత్రమే కాదు.. మా కుటుంబ వారసత్వంలో అదొక భాగం. నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో తన పెళ్లి జరగాలని నాగచైతన్య కోరాడు. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా సింపుల్‌గా ఈ పెళ్లిని జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం.

King Nagarjuna Comment

ఈ పెళ్లి వేడుకకు మా కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులలో ఓ 300 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాము. అందమైన వివాహ వేదిక సెట్‌ను ఈ పెళ్లి కోసం సిద్ధం చేస్తున్నారు. పెళ్లి పనులు కూడా చై శోభిత దగ్గరుండి చూసుకుంటున్నారు.‌ శోభిత వాళ్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని మమ్మల్ని కోరారు. నాకు కూడా పెళ్లి మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’’ అని తెలిపారు కింగ్ నాగార్జున. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కాగా,ఇది నాగచైతన్యకు రెండో వివాహం. మొదట స్టార్ హీరోయిన్ సమంతను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు కలిసున్న ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో.. విడాకులు తీసుకున్నారు. మరో వైపు శోభిత కూడా హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

Also Read : Prabhas-Sharmila : ప్రభాస్ తో తనకున్న రిలేషన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు

Akkineni Naga ChaitanyaCommentsking nagarjunaSobhita DhulipalaViral
Comments (0)
Add Comment