King Nagarjuna: విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. అతీంద్రియ శక్తుల నేపధ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిసెంబరు 1 నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. సూపర్ నేచులర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘దూత’ వెబ్ సిరీస్ కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నాగచైతన్య యాక్టింగ్, విక్రమ్ కే కుమార్ టేకింగ్, ఉత్కంఠభరితమైన కథనం, ఇషాన్ చాబ్రా నేపథ్య సంగీతం, మికోలజ్ సైగులా సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనితో స్ట్రీమింగ్ అయిన రెండో రోజునే ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ టాప్ 10 లిస్టులో చేరి… కొన్ని గంటల్లోనే నెంబర్ 1 ప్లేస్ ను కైవసం చేసుకుంది.
King Nagarjuna – ‘దూత’ వీక్షించిన కింగ్ నాగార్జున
దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సాధించిన ‘దూత’ వెబ్ సిరీస్ ను నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున(King Nagarjuna) తాజాగా వీక్షించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కింగ్ నాగార్జున… ‘‘దూత’ సిరీస్ చూశాను. చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చై అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతడి నటన చూసి ఆశ్చర్యపోయా. టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దీనితో నాగ్ ట్వీట్ పై అటు చై తో పాటు అక్కినేని కుటుంబం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టు సాగర్ పాత్రలో చై ఒదిగిపోయారంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Also Read : Ram Charan: మైసూర్ చాముండేశ్వరి సన్నిధిలో రామ్ చరణ్