Kichcha Sudeep : హనుమాన్ సినిమా బ్యానర్ లో ‘కిచ్చా సుదీప్’ హీరోగా మరో సినిమా.!

హనుమాన్ సినిమా బ్యానర్ లో 'కిచ్చా సుదీప్' హీరోగా మరో సినిమా...

Kichcha Sudeep : ‘హనుమాన్‌’తో భారీ విజయం అందుకొంది ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. కిచ్చా సుదీప్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు సోమవారం సుదీప్‌ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా విశేషాలను వెల్లడించారు. ‘ విక్రాంత్‌ రోణ’ ఫేమ్‌ అనూప్‌ భండారీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

Kichcha Sudeep Movies

ఈ చిత్రానికి ‘బిల్లారంగా భాషా -ఫస్ట్‌ బ్లడ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈమేరకు కాన్సెప్ట్‌ వీడియో షేర్‌ చేశారు నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Also Read : NBK-50 : బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో స్పీచ్ అదరగొట్టిన మెగాస్టార్

CinemaKichcha SudeepTrendingUpdatesViral
Comments (0)
Add Comment