Kichcha Sudeep : కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటనతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడీ స్టార్ హీరో. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు సుదీప్. ‘కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్’ పేరుతో కొత్త చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాడు. సుదీప్(Kichcha Sudeep) బంధువు సంచిత్ సంజీవ్ ఫౌండేషన్ లోగో, టీ-షర్ట్‌ను ఇటీవల విడుదల చేశారు. తద్వారా సుదీప్ సామాజిక సేవ చేయడానికి మరో అడుగు ముందుకేశాడు. కాగా సుదీప్‌కి ఇప్పటికే ‘కిచ్చా సుదీప్ ఛారిటబుల్ సొసైటీ’ నిర్వహిస్తున్నాడు. ఇందులోభాగంగా పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పేద పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తున్నాడు. కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు కిరాణా సామాన్లు అందించాడు. ఇప్పుడు ‘కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్’ ద్వారా సుదీప్(Kichcha Sudeep) మరో అడుగు ముందుకేశాడు.
Kichcha Sudeep Starts..
సుదీప్‌కి ఇప్పటికే ‘కిచ్చా సుదీప్ ఛారిటబుల్ సొసైటీ’ ఉంది. ఇందులోభాగంగా పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా వెనుకబడిన పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తారు. కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు కూడా నిత్యావసర సరుకులు సరఫరా చేశాడు సుదీప్. ఇప్పుడు ‘కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్’ ద్వారా సుదీప్ మరో అడుగు ముందుకేశాడు. అవసరమైన వారికి విద్య, వైద్య సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. తద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఈ స్టార్ హీరో నిర్ణయించుకున్నారు.
సుదీప్ ఇప్పటికే ‘బిల్లా రంగ భాష’ చిత్రాన్ని ఖరారు చేశారు. అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీప్ మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. ప్రస్తుతం ‘బిగ్‌బాస్’ నిర్వహిస్తున్న షో మూడు వారాల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత సుదీప్ సినిమా పనుల్లో బిజీ కానున్నాడు.
Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో పార్వతి దేవిగా కాజల్