Kiccha Sudeep : ఎవరైనా అవార్డు వస్తుందంటే ఎగిరి గంతేస్తారు. రాని వాళ్లు నానా తంటాలు పడతారు. తమకు వచ్చి ఉంటే బావుండనని అనుకుంటారు. దేశ వ్యాప్తంగా ఓ గుర్తింపు కూడా లభిస్తుంది. పురస్కారాలు ప్రకటిస్తుంటే చాలా మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు ఉత్కంఠతో ఎదురు చూస్తారు.
Kiccha Sudeep Rejected…
కానీ శాండిల్ వుడ్ రంగానికి చెందిన ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep) మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తనను ఏరి కోరి కర్ణాటక ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు కోసం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం కూడా పంపించింది.
దీనిపై తీవ్రంగా స్పందించాడు కిచ్చా సుదీప్. సున్నితంగా తిరస్కరించారు. తనకు అవార్డులు తీసుకోవడం ఇష్టం లేదంటూ పేర్కొన్నాడు. ఆపై అవార్డుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సినీ రంగంలో ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది అనుభవం కలిగిన, అత్యంత ప్రతిభావంతులైన నటీ నటులు ఉన్నారని , వారిని ఎంపిక చేస్తే బావుంటుందంటూ సూచనలు కూడా ఇచ్చాడు కిచ్చా సుదీప్.
చాలా సంవత్సరాల నుంచి నేను నటిస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన అవార్డులను తిరస్కరిస్తూ వస్తున్నానని చెప్పాడు. ఇదిలా ఉండగా 2019లో ఎస్ కృష్ణ దర్శకత్వం వహించిన పైల్వాన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే తనను గుర్తించి పురస్కారం ప్రకటించినందుకు ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తిరస్కరిస్తున్నందుకు మన్నించాలని కోరాడు కిచ్చా సుదీప్.
Also Read : Beauty Khushi Kapoor : ఫిబ్రవరి 7న రానున్న లవ్‌యాపా