Kiccha Sudeep : ఆ గౌరవ డాక్టరేట్ ని వద్దనుకున్న కన్నడ హీరో కిచ్చా సుదీప్

వినోదం, నటనతోపాటు సుదీప్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు...

Kiccha Sudeep : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ నటుడు కిచ్చ సుదీప్. ఈగ సినిమాలోవిలన్ గా నటించి మెప్పించాడు. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించడం నిజంగాగొప్ప విషయం అనేచెప్పాలి. ఇక సుదీప్ హీరోగా నటించినసినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తున్న సుదీప్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.

సుదీప్ చేసిన మంచి పనులకు తుమకూరు విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే దీనిని కిచ్చా సుదీప్ నిరాకరించాడు. కిచ్చా సుదీప్ కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీప్ డాక్టరేట్ ఎందుకు నిరాకరించాడంటే..కిచ్చా సుదీప్‌(Kiccha Sudeep)కు తుమకూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. వివి సిండికేట్ సమావేశంలో జరిగిన చర్చను సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్శిటీ నిర్ణయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన సుదీప్.. దానిని నిరాకరించాడు. ‘ సమాజానికి సేవ చేసిన వాళ్లు నాకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి డాక్టరేట్ ఇప్పించండి’ అని సుదీప్ అభ్యర్థించాడు.

Kiccha Sudeep…

వినోదం, నటనతోపాటు సుదీప్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సుదీప్ పీఏ ద్వారా పంపించారు. అయితే సుదీప్ మాత్రం దీనిని నిరాకరించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. వాటర్ స్పోర్ట్స్ సాహసికుడు, సామాజిక కార్యకర్త సి.ఎస్. నాగనందన స్వామి, పారిశ్రామికవేత్త హెచ్. రాజన్నహళ్లి వాల్మీకి గురుపీఠానికి చెందిన జి.చంద్రశేఖర్, అలాగే వాల్మీకి ప్రసన్నానంద స్వామీజీలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.

Also Read : Sonu Sood : బంగ్లాదేశ్ లో హిందువుల ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్

kitcha sudeepTrendingUpdatesViral
Comments (0)
Add Comment