Kiara Advani: డాన్ 3 కు సిద్ధమౌతున్న కియారా అద్వానీ !

డాన్ 3 కు సిద్ధమౌతున్న కియారా అద్వానీ !

Kiara Advani: గతేడాది ‘సత్యప్రేమ్‌ కీ కథా’ సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ… ఈ ఏడాది ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో రావడానికి ముస్తాబవుతోంది. త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్‌ ఛేంజర్‌’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌తో ‘డాన్‌ 3’లో నటించడానికి సన్నాహాలు చేస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఫర్హాన్‌ అక్తర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించానికి చిత్ర యూనిట్ సిద్ధమౌతోంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న ఈ నయా డాన్‌ పాత్రను మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దుతున్నారట దర్శకుడు ఫర్హాన్ అక్తర్. మొదటి షెడ్యూల్‌ లో భాగంగా ఈ సినిమాకే కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Kiara Advani Movies

2010లో ‘బాండ్ బాజా బారాత్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రణ్‌వీర్ సింగ్… పద్మావతి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, శింభ, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో నటి దీపిక పదుకొణెను వివాహం చేసుకున్నాడు. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింగం ఎగైన్’ చేస్తున్నారు.

Also Read : Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్..పుష్ప 3 పై కీలక అప్డేట్

Don 3Kiara Advaniranveer singh
Comments (0)
Add Comment