Kiara Advani: సినిమా డైలాగ్ తో కియారాను పడేసిన సిద్ధార్ధ్ మల్హోత్ర

సినిమా డైలాగ్ తో కియారాను పడేసిన సిద్ధార్ధ్ మల్హోత్ర

Kiara Advani: ‘షేర్షా’ సినిమాతో ప్రారంభమైన తమ స్నేహ బంధాన్ని… ప్రేమగా మలచుకుని వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న కియారా అద్వానీ… ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ వెల్లడించిన పలు విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Kiara Advani – ‘షేర్షా’ లోని డైలాగ్ తో లవ్ ప్రపోజ్ చేసిన సిద్ధార్ధ్

‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న కియారా అద్వానీ(Kiara Advani)… తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ‘తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్ర లవ్‌ ప్రపోజ్‌ చేసిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘షేర్షా’లోని డైలాగ్‌ చెప్పి సిద్ధార్ధ్ తన ప్రేమను వ్యక్తపరిచాడంటూ ఆమె తెలిపారు. ‘షేర్షా’ సినిమా తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. దీనితో సిద్ధార్థ్‌, అతని కుటుంబసభ్యులతో కలిసి ఓ సారి రోమ్‌ టూర్‌కు వెళ్లాను. అప్పుడే అతడు నాకు ప్రపోజ్‌ చేస్తాడని నాకు అర్థమైంది. దీనితో ‘నువ్వు నాకు ప్రపోజ్‌ చేయాలనుకుంటే ముందు నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకోవాలి’’ అని నేను సిద్ధార్ధ్ కు ఖరాఖండీగా చెప్పాను. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత… నేను, సిద్ధార్థ్‌, వాళ్ల బంధువు ఒకరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లాం. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ అనంతరం వాకింగ్‌కు వెళ్దామని సిద్ధార్థ్‌ అడగడంతో ఓకే అన్నాను.

అయితే మేమిద్దరం కాస్త దూరం వెళ్లగానే చుట్టుపక్కల ఉన్న పొదల్లోంచి ఒక్క వ్యక్తి వయోలిన్‌తో మా వద్దకు వచ్చి ప్లే చేస్తూ ఉన్నాడు. వెంటనే, సిద్ధార్థ్‌ మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’లోని… ‘‘దిల్లీ కా సీదా సాదా లుండా హు’’ (దిల్లీ నుంచి వచ్చిన ఓ సాదాసీదా అబ్బాయిని నేను) అంటూ డైలాగ్‌ చెప్పి తన లవ్ ను ప్రపోజ్ చేసాడు. సిద్ధార్ధ్ ఆ డైలాగ్‌ చెప్పగానే నేను బాగా నవ్వి… ప్రేమకు ఒకే చెప్పాను. మా ఇద్దరి జీవితాల్లో ఎంతో విలువైన ఈ క్షణాలను సిద్ధార్థ్‌ బంధువు వీడియో తీశాడు’’ అంటూ కియారా ఆ క్షణాలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ(Kiara Advani) చెప్పిన విషయాలు సోసల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ధోనీ నుండి గేమ్ ఛేంజర్ వరకు

2014లో ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై బ్యూటీ కియారా అద్వానీ… 2016లో విడుదలైన ధోనీ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా(Kiara Advani)… ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్ధ్ మల్హోత్ర ను ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న జైసల్మేర్‌ (రాజస్థాన్‌)లోని సూర్యగఢ్‌ ప్యాలస్‌లో పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేసిన ఇదే కార్యక్రమంలో విక్కీ కౌశల్‌ తన భార్య కత్రిన కైఫ్ కు లవ్‌ ప్రపోజల్‌ను చెప్పిన అంశాన్ని వెల్లడించారు.

Also Read : Captain Vijayakanth: విజయకాంత్‌కు మళ్ళీ అస్వస్థత

kiyara advanisiddharth malohotra
Comments (0)
Add Comment