Kiara Advani: ‘కేజీయఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్’. 2023 డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా… వెయ్యి కోట్ల కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. దీనితో ‘సలార్ పార్ట్ 2’ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. జూన్ లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.
Kiara Advani Movie Updates
అయితే ‘సలార్ పార్ట్ 2’ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. రెండో భాగంలో మరికొన్ని అదనపు ఆకర్షణలు ఉంటాయని… అందులో భాగంగా మరో కథానాయికని ఎంపిక చేయడంపై చిత్రబృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. తొలి భాగంలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ‘సలార్ 2’లోనూ ఆమె పాత్ర కీలకం. అయితే శ్రుతితోపాటు, కియారా అద్వానీ(Kiara Advani) కూడా రెండో భాగంలో ఓ కీలక పాత్రని చేయనున్నారని తెలిసింది. సినిమాలో ప్రత్యేక గీతంలోనూ కియారా ఆడిపాడనున్నారనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో… హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Manjummel Boys OTT : మల్లి మారిన ‘మంజుమ్మేల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్