Khushi Movie : ఫీల్ గుడ్ సినిమా ఖుషీ

విజ‌య్ దేవ‌ర కొండ‌..స‌మంత

Khushi Movie : రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ , న‌టి స‌మంత క‌లిసి న‌టించిన ఖుషీ చిత్రం ఆక‌ట్టుకునేలా ఉంది. విడుద‌లైన ప్ర‌తి చోటా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తెలుగులో చాలా గ్యాప్ త‌ర్వాత పూర్తి వినోదం, క‌ళాత్మ‌క , కొత్త బ్యాక్ డ్రాప్ తో కూడాన క‌థను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌.

Khushi Movie Viral

అద్భుత‌మైన పాట‌లు, అంత‌కంటే మించి మ‌న‌సు దోచే దృశ్యాలు ఖుషీ చిత్రానికి అద‌న‌పు బ‌లంగా మ‌రాయి. ఎమోష‌న‌ల్ క్లైమాక‌స్ సినిమాకు ఎదురైన చిన్న చిన్న అవాంత‌రాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. స‌కుటుంబం మొత్తం హాయిగా చూసి త‌రించే సినిమాగా రూపొందించాడు ద‌ర్శ‌కుడు.

ర‌ణ‌గొణ ధ్వ‌నులు లేకుండా కేవ‌లం క‌ళాత్మ‌క‌త‌కు ప్ర‌యారిటీ ఇస్తూ తీయ‌డం అభినంద‌నీయం. ఆరాధ్య‌గా స‌మంత రుతు ప్ర‌భు మెప్పించింది. మ‌న‌సు దోచుకుంది. ఇక ఎప్ప‌టి లాగే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌లో మంచి న‌టుడు ఉన్నాడ‌ని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్ప‌టికీ ల‌వ్లీ బాయ్ గా ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం చిత్రంలో నిరూపించుకున్నాడు. ఏది ఏమైనా ప్ర‌తి ఒక్క‌రూ హాయిగా సినిమా చూసి త‌ర‌లించాల‌ని అనుకుంటే, హృద‌యం ఉప్పొంగేలా చేయాల‌ని అనుకుంటే త‌ప్ప‌కుండా ఖుషీ చిత్రం(Khushi Movie) చూడాల్సిందే. అది మ‌న‌ల్ని వెంటాడుతుంది. మైమ‌రిచి పోయేలా చేస్తుంది.

Also Read : Wamiqa Gabbi Vs Komalee Prasad

Comments (0)
Add Comment