Khushi Kapoor : అందాల తార దివంగత శ్రీదేవి ముద్దుల తనయ ఖుషీ కపూర్(Khushi Kapoor) నటించిన లవ్‌యాపా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. యంగ్ హీరో జునైద్ ఖాన్ తో కలిసి తెర మీద త్వరలో సందడి చేయనుంది. పూర్తి రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా తెరకిక్కంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఈ మూవీలో. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ , టీజర్ కు జనాదరణ లభించింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరి లవ్ పెయిర్ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
Khushi Kapoor Movie Updates
యంగ్ కపుల్స్ గా ఇందులో ప్రేమను, రొమాన్స్ ను పండించేందుకు రెడీ అయ్యారు. తాజాగా లవ్ యాపా మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే నెల ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు డైరెక్టర్. ఈ చిత్రంలోని ఆకర్షణీయమైన పాటలు, ప్రత్యేకమైన కథాంశం ఇప్పటికే నెటిజన్ల నుండి చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఖుషీ కపూర్ , జునైద్ ఖాన్ స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి. వారి కొత్త ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంటర్నెట్‌లో కూడా చర్చనీయాంశమైంది. ప్రధాన జంట తమ కొత్త సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు.
Also Read : Obama – Beauty Jennifer : ఒబామా ఓలాలా జెన్నిఫర్ ఉయ్యాల