Kushboo-Vishal : హీరో విశాల్ ఆరోగ్యానికి కారణాలు వెల్లడించిన నటి ఖుష్బూ

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ....

Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లేటెస్ట్ ఫిల్మ్ ‘మదగజరాజ’ మూవీ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. ఆయన రూపంలో కూడా పలు మార్పులు కనిపించాయి. దీంతో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇవి చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ హెల్త్ పై క్లారిటీ ఇస్తూ.. ఇప్పటికే చెన్నై అపోలో డాక్టర్లు బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా అసలు విశాల్ కు ఏం జరిగిందో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ(Kushboo) వివరించారు.

Hero Vishal..

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ‘‘విశాల్‌కు ఢిల్లీలో ఉన్నప్పుడే ఫీవర్ వచ్చింది. ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, ‘మదగజరాజ’ సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌కు వచ్చారు. ఆ రోజు విశాల్‌ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగాను. ‘11 ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకువస్తోంది. దీనికి కచ్చితంగా రావాలనుకున్నాను’ అని చెప్పారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ఆ ఈవెంట్‌ పూర్తికాగానే మేం విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు కోలుకుంటున్నారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు.

కొంత మంది యూట్యూబర్స్ వ్యూస్‌ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారు. ‘మదగజరాజ’ కోసం విశాల్‌ ఎంతో కష్టపడ్డాడు” అన్నారు. కాగా, మదగజరాజ మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకొగా.. 12 ఏళ్ల అనంతరం ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి సుందర్. సి దర్శకత్వం వహించగా.. అంజలి, వరలక్ష్మి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. విజయ్ ఆంటోని సంగీతం దర్శకత్వం వహించాడు.

Also Read : Sivakarthikeyan : శివకార్తికేయన్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో

Hero VishalKushboo SundarUpdatesViral
Comments (0)
Add Comment