Khufiya Teaser : ఖుఫియా టీజ‌ర్ బ‌హుత్ ఖుష్

టబు..అలీ ఫ‌జ‌ల్..వామికా గ‌బ్బి

నెట్ ఫ్లిక్స్ లో ఖుఫియా టీజ‌ర్ వైర‌ల్ గా మారింది. ఇందులో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ట‌బు, అలీ ఫ‌జ‌ల్ న‌టించారు. స్కిప్ట్ , డైలాగులు విశాల్ భ‌ర‌ద్వాజ్ రాశారు. త్వ‌ర‌లో ఓటీటీలో విడుద‌ల కానుంది. దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది న‌టి ట‌బు.

ఆ మ‌ధ్య తెలుగులో త్రివిక్ర‌మ్ బ‌న్నీతో తీసిన అల వైకుంఠ‌పురంలో న‌టించారు. చాలా ఏళ్ల గ్యాప్ త‌ర్వాత ట‌బు న‌టించ‌డం ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. చిత్ర నిర్మాత‌లు టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది దీనికి.

ఖుఫియా షూట్ 12 గంట‌లు అని ట్యాగ్ లైన్ త‌గిలించారు. ఫిల్మ్ క్యా హై అని క్యాప్ష‌న్ కూడా త‌గిలించ‌డం విశేషం. ఈ మ‌ధ్య‌న బాలీవుడ్ లో సినిమాల కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువ‌గా వెబ్ సీరీస్ విడుద‌ల అవుతున్నాయి.

ఆ మ‌ధ్య ల‌స్ట్ సీరీస్ కు భారీ క్రేజ్ వ‌చ్చింది. కార‌ణం ఇందులో త‌మ‌న్నా భాటియాతో పాటు బాలీవుడ్ న‌టి కాజోల్ న‌టించ‌డం. ఇందులో మోతాదుకు మించిన సీన్స్ ఉన్నాయి. మ‌రి ట‌బు ఇందులో సీరియ‌స్ పాత్ర‌కు ప‌రిమిత‌మైన‌ట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనా ఓటీటీలో వ‌స్తే కానీ ఖుఫియా ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చెప్ప‌లేం.

Comments (0)
Add Comment